ఏపీ డీజీపీగా ద్వారకాతిరుమలరావు బాధ్యతల స్వీకరణ
ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కాగా మంగళగిరి సమీపంలోని డీజీపీ కార్యాలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఐపీఎస్ అధికారులు,కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించారు.

