InternationalNews Alert

 ట్రంప్ మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలు

Share with

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ తాజాగా సోదాలు నిర్వహించింది. ఫ్లోరిడాలో ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగ్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ దేశానికి సంబంధించిన ముఖ్యమైన రహస్య పత్రాలను తన వద్ద దాచుకున్నాడన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో ఎఫ్.బీ.ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే అసలు విషయం ఏమిటన్నది ఏ అధికారి ధృవీకరించలేదు. కానీ..ట్రంప్ కుటుంబ సభ్యులు మాత్రం తమపై వేధిపుల్లో భాగంగానే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిత్యం సీక్రెట్ సర్వీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలో తనిఖీు నిర్వహించేందుకు అన్ని అనమతులు పొందినట్లు ఎఫ్.బీ.ఐ అధికారులు చెబుతున్నారు. ముందుగా విషయాన్ని సీక్రెట్ సర్వీసెస్ అధికారులకు తెలిపామని అంటున్నారు. వారెంట్ఎ ను పరిశీలించాకే వారికి తనిఖీ చేసేందుకు అనుమతించినట్లు సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఆకస్మిక సోదాలను గురించి ట్రంప్ కుమారుడు ఎరిక్ తాజాగా ఓ ఆంగ్ల వార్తా పత్రికతో మాట్లాడుతూ..ఒక్కసారిగా దాదాపు 30 మంది సిబ్బంది మార్-ఎ-లాగోలోకి ప్రవేశించారన్నారు. కానీ వారు ఎఫ్‌బీఐ నుంచి రాలేదని ఆయన తెలిపారు.వారు ఖచ్చితంగా వైట్ హౌజ్ నుంచే వచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కావాలనే ట్రంప్ ‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎరిక్ అంటున్నారు ఇందులో పూర్తిగా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని దుయ్యబట్టారు. ఎన్నో రోజులుగా ఈ దర్యాప్తు సంస్ధలకు ట్రంప్ సహకరిస్తున్నారిస్తున్నట్లు ఎరిక్  పేర్కొన్నారు. గతంలో కూడా ఎఫ్‌బీఐ నిర్వహించిన సోదాల్లో ట్రంప్ ఇంట్లో సుమారు 15 బాక్సుల్లో పత్రాలు గుర్తించామని ఎఫ్‌బీఐ సిబ్బంది స్పష్టం చేశారని, దీనిపై మీ అభిప్రాయం తెలపమని అడుగగా ..ఎరిక్ స్పందిస్తూ.. పదవీ కాలం అనంతరం వైట్ హౌజ్‌ను ఖాళీ చేయడానికి ట్రంప్‌కు కేవలం 6 గంటల సమయం మాత్రమే అధికారులు ఇచ్చారని చెప్పారు. దాంతో ఆయన అప్పటివరకు తన దగ్గర ఉన్న క్లిప్పింగులను 15 బాక్సుల్లో భద్రపరిచారని..అవే అధికారులు గతంలో  గుర్తించారన్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఎఫ్‌బీఐ దాడులపై తనదైన శైలిలో స్పందించారు. తనకు చెందిన మార్-ఎ-లాగ్ ఎస్టేట్‌ను ఎఫ్‌బీఐ అధికారులు ఆక్రమించుకోవాలనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని. ఇలాంటి పరిణామాలు ప్రపంచానికి ఓ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయని ఆయన అన్నారు. తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నా.. వారు అనవసరంగా దాడులకు పాల్పడుతున్నారని ట్రంప్ స్పష్టం చేశారు. మూడోసారి అధ్యక్ష పదవి కోసం పోటి చేయాలనుకుంటున్న ట్రంప్‌పై అధికారులు  వరుసగా దాడులు జరపడం సంచలనంగా మారింది. అయితే మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో ఉన్నట్లు సమాచారం.