Andhra PradeshHome Page Slider

నా మనస్సుకు దగ్గరైన శాఖలు ఇవే..పవన్ కళ్యాణ్

Share with

ఏపీ మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు తన మనస్సుకు దగ్గరైన శాఖలని, తమ పార్టీ జనసేన సిద్దాంతాలకు సరిపోయేలా ఉన్నాయని జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు నచ్చిన కీలక శాఖలు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు తనకెంతో ఇష్టమైనవని, అటవీ సంపదను కాపాడుతూ పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.  గ్రామీణ ప్రజాజీవితాన్ని దగ్గర నుండి చూసే అవకాశం, ప్రజలలో మమేకమయ్యే అవకాశం లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అయితే నిన్న మంత్రివర్గ కూర్పులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్‌కు గ్రామీణాభివద్ధి, అటవీ శాఖ, గ్రీన్ ఎనర్జీ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు ఇచ్చిన శాఖలపై కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాలు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులపై దృష్టి పెడతానని, గ్రీన్ ఎనర్జీ దిశగా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని, సినీ పరిశ్రమకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.