NationalNews

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు లాంఛనమేనా!

Share with

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్కడ్ పోటీ చేస్తుండగా, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా బరిలో నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థికి తగిన మద్దతు లభిస్తోండటంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకోవచ్చు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్ ఆల్వాకు ఓటేసేందుకు తృణముల్ సిద్ధంగా లేకపోవడంతో… ఎన్డీఏ అభ్యర్థికి భారీ మెజార్టీ లభించే అవకాశం కన్పిస్తోంది. మార్కెరెట్ ఆల్వా గతంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా వ్యవహరించారు. రాజస్థాన్ కు చెందిన జగదీప్ దన్కడ్ బలమైన జాట్ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో మార్గరెట్ ఆల్వాకు 26 శాతం ఓట్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. సుమారుగా ఆమెకు 200 ఓట్లు పోలవ్వచ్చు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎస్పీ, లెఫ్ట్ పార్టీలతోపాటు, టీఆర్ఎస్ సైతం ఆల్వాకు సపోర్టే చేస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్కడ్ కు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయవతి ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.