ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ దీమాగా ఉంది. నెంబర్ల ఈక్వేషన్… బీజేపీ గెలుపు సునాయశమంటోంది. రాజ్యసభలో 92 మంది, లోక్‌సభలో 303 మంది సభ్యులు బీజేపీకి ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో పోల్చుకుంటే… ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మిత్రుల అవసరం కూడా బీజేపీకి లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో కేవలం లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందుగా ఎలాంటి ఎన్నికలూ లేకపోవడంతో బలాబలాలు మారే అవకాశం కూడా లేదు. రాజ్యసభలో 232, లోక్ సభలో 543 మంది సభ్యులున్నారు. ఉభయసభల్లో బీజేపీ బలం 395గా ఉండగా విక్టరీ మార్క్ కేవలం 388 ఓట్లే…
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలైంది. 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆగస్టు 6న పోలింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది. నూతన ఉపరాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఎన్నుకోనున్నారు. పోటీ అనివార్యమైతేనే… ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. జులై 19 నామినేషన్ స్వీకరణకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. జులై 20న నామినేషన్ల పరిశీలిస్తారు… జులై 22 నామినేషన్లకు ఉపసంహరణకు ఆఖరి తేదీ.