News Alert

విశాఖలో మాంకీ పాక్స్ కలకలం

Share with

కరోనా తగ్గు ముఖం పట్టిందని సంతోషించే లోగా మాంకీ పాక్స్ కొత్త వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా మాంకీ పాక్స్ కేసులు అన్ని చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గీతం  వైద్య విద్యార్థికి మాంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లక్షణాలు ఉన్న విద్యార్థి కొద్ది రోజుల కిందట హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్టు గీతం వైద్య బృందం తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడ్ని ఐసోలేషన్‌లో ఉంచగా , మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించేదుకు జిల్లా వైద్యాధికారులకు సంప్రదించినట్టు తెలిపారు.

వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువకుడు ఉన్న రూమ్ కి వెళ్లి చూసేసరికి ఐసోలేషన్‌లో ఉన్న యువకుడు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలిసిన గీతం వైద్య అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారమిచ్చారు.