రిషి సునాక్‌కు తెల్లోళ్ల ఝలక్
ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతి నేత రిషి సునాక్ వెనుకబడ్డారు. పార్టీ నుంచి అనుకున్నంత సానుకూలత లభించకపోవడంతో ఆయన ప్రత్యర్థి ముందంజలో నిలుస్తున్నారు. ఎన్నికలో తాను వెనుకంజలో నిలిచినట్టు రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ను ప్రధానిగా చేయాలని పార్టీలోని మెజార్టీ నేతలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానిగా లిజ్ ట్రస్ ను గెలిపించాలని తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ నేతలకు చెబుతూ వస్తున్నారు. తనను అప్రదిష్టపాల్జేశారని.. రుషి సునాక్ పై ఆయన గుర్రుగా ఉన్నారు. ఎన్నికల్లో రిషిని ఓడించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన గతంలోనే పిలుపునిచ్చారు. లక్షా 60 వేల మంది కన్జర్వేటివ్ సభ్యులు బ్రిటన్ ప్రధాని ఎవరన్నది నిర్ణయిస్తారు. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు మొత్తం 12 రౌండ్లలో పోరు జరుగుతుంది.