తెలుగు రాష్ట్రాల్లో సినీ పెద్దల కీలక భేటీలు
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్ల, థియేటర్ యజమాన్యాలు అత్యవసర సమావేశం విజయవాడలో జరగనుంది. OTT లో విడుదలవుతున్న సినిమాలు నిలిపి వేయాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాంధీనగర్ ఫిలిం ఛాంబర్‌లో నేడు సమావేశం నిర్వహిస్తారు. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఇవాళ ఫిలిం ఛాంబర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సినీ రంగ సమస్యలపై చర్చిస్తారు. నిర్మాతల, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టార్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. విపిఎఫ్ , ఓటిటి , కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ , టికెట్ ధరలపై సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఛాంబర్ , నిర్మాతల మండలి సూచనలను పరిగణలోకి తీసుకొని ధరలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు.