InternationalNews

బ్రిటన్ ప్రధాని రెండో దశ ఎన్నికలో రిషి సునక్ ముందంజ…

Share with

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ అత్యధిక ఓట్లతో రెండో దశ ఎన్నికలో ముందంజలో నిలిచారు. కన్జర్వేటివ్‌ పార్టీ నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో.. 101 ఓట్లతో రిషి సునాక్‌ ముందంజలో నిలిచారు. పెన్నీ మోర్డాంట్‌ 83 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక భారత సంతతికి చెందిన సువెల్లా బ్రావెర్మన్‌ (అటార్నీ జనరల్‌) పోటీ నుంచి వైదొలిగారు. ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించి.. చివరికి ఒకరిని ఎన్నుకుంటారు. మెజార్టీ ఉన్న పార్టీ తరపున అభ్యర్థి కావడంతో కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి చివరగా మిగిలిన వ్యక్తే ప్రధాని అవుతారు.

Read More: I2U2 తొలి సమావేశంలోని ముఖ్యంశాలు