crimeHome Page SliderNationalNews Alertviral

బాలుడిని కిడ్నాప్ చేసిన లేడీ ట్యూషన్ టీచర్..ట్విస్ట్ ఏంటంటే..

11 ఏళ్ల తమ బాలుడిని ట్యూషన్ టీచర్(23) కిడ్నాప్ చేసిందంటూ కేస్ పెట్టారు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆ బాలుడి తండ్రి. దీనితో కేసు నమోదు చేసి, విచారిస్తున్న పోలీసులకు అనేక ట్విస్ట్‌లు ఎదురయ్యాయి. వీరిద్దరూ రాజస్థాన్ సరిహద్దులోని ఒక ప్రైవేట్ బస్సులో ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి 4 రాష్ట్రాలు చుట్టి వచ్చారని తెలిసింది. వారిని సూరత్‌కు తరలించి విచారించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ జరగలేదని, ఇద్దరూ కలిసే వెళ్లారని తేలింది. వీరిద్దరి మధ్యా స్నేహం మాత్రమే ఉందని, వారి వారి ఇళ్లలో కుటుంబసభ్యులు తిట్టడంతో వారి తిట్లు పడలేక వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలనుకున్నారని తెలిసింది. ఈ ప్రాంతంలోనే మూడేళ్లుగా ఉంటున్న వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా పరిచయం ఉందని తెలిసింది.