నాలుగో రౌండ్ ఓట్లు రీకౌంట్ చేయాలి
మునుగోడు ఉప ఎన్నికలో 4వ రౌండ్ ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆర్వోతో మాట్లాడానని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని.. ఈ ఎన్నికల్లో అంతిమ విజయం తనదేనని అన్నారు. తనను ఎక్కడా తిరగకుండా అష్టదిగ్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌరవ సైన్యం దుర్మార్గపు పనులు చేసిందని.. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.