ఏపీ హైకోర్టుకు 7గురు కొత్త న్యాయమూర్తులు…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది .వీరందరూ న్యాయాధికారుల నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వీరిని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది.హైకోర్టు జడ్జిలుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటూకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణల పేర్లను హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు.
Read More: బియ్యం పంపిణీలో కేసీఆర్ సర్కారు విఫలం