చంద్రబాబును పట్టించుకోని టీడీపీ ఎంపీ కేశినేని నాని
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుతో అసహనంగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని… ఆ అక్కసును ఢిల్లీ కేంద్రంగా వెళ్లగక్కారు. చంద్రబాబును టీడీపీ ఎంపీలు సత్కరిస్తున్న సమయంలో ఆయన వైఖరి బయటపడింది. చంద్రబాబుకు బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ కోరినప్పటికీ… అందుకు ఆయన నిరాకరించారు. మీరే ఇవ్వండంటూ గల్లాకు సూచించారు నాని. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మీడియా ప్రతినిధులందరూ నాని ప్రవర్తనతో షాక్‌కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా పార్టీపై కేశినేని అలకబూనారు. నియోజికవర్గంలో తన సోదరుడు చిన్నిని చంద్రబాబు ప్రోత్సహించడంపై ఆగ్రహంగా ఉన్నారు. కుటుంబలో చిచ్చు పెడుతున్నారన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఆయన మనుసులో ఏముందోనన్నదానిపై క్లారిటీ వచ్చింది. చంద్రబాబు తీరును ఆక్షేపిస్తున్న నాని… ఢిల్లీలో బాబుతో సన్నిహితంగా వ్యవహరించలేకపోతున్నట్టుగా అన్పిస్తోంది.