కోళ్లను వేలం వేసిన కోర్టు
మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను న్యాయమూర్తి సమక్షంలో వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో 84 పందెం కోళ్లు రూ. 16.65 లక్షలకు అమ్ముడుపోవడం విశేషం.ఈ నెల 12న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్టలో ఓ ఫాంహౌస్ లో కోడి పందేలు నిర్వహిస్తూ 64 మంది పట్టుబడ్డారు.వారితో పాటు ఉన్న 85 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీటి రక్షణ చర్యలు ఇబ్బందికరంగా మారడంతో వీటిని వేలం వేశారు.ఇందులో ఓ కోడి చనిపోయింది. మిగిలిన వాటిని రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు.అయితే న్యాయమూర్తి వేలంపాట నిర్వహించడంతో.. వేలంపాట సమాచారం అందుకున్న పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాజమహేంద్రవరం, ఏలూరు, నూజివీడు తదితర ప్రాంతాలకు చెందిన వారు అత్యధికంగా ఈ వేలంలో పాల్గొన్నారు.ఇదే కేసులోని నిందితులుగా ఉన్న వారి అనుచరులు సైతం పాల్గొని తమ కోళ్లను దక్కించుకున్నారు.

