గత పాలకుల నిర్లక్ష్యంతో ఇలాంటి పరిస్థితి..
ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC) ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత పాలకులు, గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ కూడా తవ్వకుండా శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేశారని భట్టి మండిపడ్డారు. 1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం… గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా 4వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెను భారం పడిందన్నారు.
గోదావరిపై లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోయింది.. కృష్ణానది పై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదు.. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణ నుంచి గత పది ఏళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను… గత పాలకులు పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది.. నీళ్ల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.