Telangana

ఇకపై అలా బండి నడిపితే సీజ్

వాహనదారులకు భాగ్యనగర పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుండి వాహనాలు కొన్నవారు తప్పనిసరిగా టీఎస్ పేరుతో రిజిస్ట్రషన్ , నంబర్ ప్లేట్ తీసుకోవాల్సిందే అని చెప్పారు. అలా చేయకుండా బండి నడిపే వారి వాహనాన్ని సీజ్ చేస్తామని అన్నారు. ఇప్పటికే ఇటీవల ఇటువంటి తరహా కేసులకు సంబంధించి వాహనాలను సీజ్ చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకున్న వాహనాలకు అక్కడ NOC తీసుకుని లైఫ్ టాక్స్ కడితే సరిపోదని… ఇక్కడ కూడా టాక్స్ పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే బండి నడపాలన్నారు. వివిధ రాష్ట్రాల నుండి తమ వాహనాలను వేరే రాష్ట్రాలకు తీసుకొని వచ్చి నడిపే వారు తప్పకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసి మాత్రమే బండి నడపాలని హెచ్చరించారు.