వేగంగా పెరుగుతున్న కరోనా -ఉచిత టీకాల పంపిణీ
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా 20 వేలకు పైగా కొత్తకేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. 4 లక్షల పైచిలుకు మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 20వేల మందికి పైగా పాజిటివ్ వచ్చింది. రికవరీ రేటు తగ్గుతోంది. నిన్న ఒక్కరోజే 47 మంది చనిపోయారు. మరోవైపు కొత్తవేరియంట్ రూపంలో కేసులు పలు రాష్ట్రాలలో పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం బూస్టర్ డోసు పంపిణీ వేగవంతం చేస్తోంది. ఇప్పటి వరకు 199 కోట్లకు పైగా టీకాలు పంపిణీ జరిగింది. ఇకనుంచి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందించనుంది. తెలంగాణ వైద్య,ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 18 ఏళ్లు పూర్తి అయిన వారికి 2 వ డోస్ అయిన తర్వాత 6 నెలల అనంతరం ఉచితంగా డోస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 75 రోజుల పాటు వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ డోసు అందుబాటులో ఉంటుందని… అన్ని కాలేజీలు, యూనివర్సిటీలలో, ఆఫీసులు, ఫాక్టరీలు, రైల్వే స్టేషన్ లలో వాక్సినేషన్ రన్ లను నిర్వహిస్తామని వైద్య, ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 040-24651119 అనే నంబరును సంప్రదిస్తే 100 కంటే ఎక్కువమంది ఉంటే అక్కడే వాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.