NationalNews

కేంద్ర నిర్ణయంతో దేశంలో ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ

Share with

కేంద్రం దేశంలో 18 ఏళ్ళు నిండిన వారందరికి ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు ఈ నెల 15 నుండి అన్ని ప్రభుత్వ కేంద్రాలలో బూస్టర్ డోస్‌ అందుబాటులోకి రానుంది .75 వ స్వాతంత్ర దినోత్సవ సంభరాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “ఆజాదీ కా అమృత్ ” లో భాగంగా  కేంద్రం బూస్టర్ డోసులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. అయితే 75 రోజుల పాటు అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాలలో బూస్టర్ డోస్‌ను ఉచితంగా అందిస్తామని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ తెలిపారు. దీనికి ఎంత ఖర్చయిన కేంద్రం భరిస్తుందన్నారు.ఇది కేంద్రం ప్రజల కోసం తీసుకున్న పెద్ద నిర్ణయం అని ఇప్పటివరకు కేంద్రం దేశ ప్రజలకు 199 కోట్ల కరోనా డోసులు అందించిందన్నారు. వీటిలో 18 ఏళ్ళు నిండిన వారు 181 కోట్లకు పైగా ఉన్నారని తెలిపారు.

దేశంలో 60 ఏళ్ళు పైబడిన వారు ,వైద్య సిబ్బంది మరియు కొవిడ్ వారియర్లకు బూస్టర్ డోస్ ఉచితంగా ఇస్తున్నాం అన్నారు. అయితే అది కొంత  శాతం ప్రజలకు మాత్రమే అందిందని ఇప్పుడు అది అందరికీ వర్తిస్తుందని ఠాకుర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 18-59 ఏళ్ళ వయసువారైన 77 కోట్ల జనాభాలో కేవలం 1 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ ను పొందారు. అయితే జనాభాలో అత్యధికులు 9 నెలల క్రితం రెండో డోసు తీసుకున్నారు.ఐసీయంఆర్ లాంటి పరిశోధన సంస్థలు మాత్రం 6 నెలల తర్వాత శరీరంలో  యాంటీబాడీల స్థాయి తగ్గుతాయని అధ్యయనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండో డోసు కూడా తీసుకోవాలని అధికార వర్గాలు ప్రజలను కోరుతున్నాయి. అదే విధంగా కేంద్రం కూడా మొదటి  డోసుకు రెండో డోసుకు మధ్య సమయాన్ని 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించింది.

Read More: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ