Andhra PradeshHome Page Slider

ఆ ఒక్కరే కాదు.. మరో ఇద్దరిపైనా వేటు వేయండి

ఏపీలో ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ , బీజేపీ నేత అరుణ్ సింగ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ ఈసీని కలిసి, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేతలను వైసీపీ సర్కారు వేధిస్తోందని ఈసీకి చెప్పారు నేతలు. ప్రభుత్వ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇటెలిజెన్స్ ఐజీ, వివేక్ యాదవ్, ధర్మారెడ్డి, రఘురామిరెడ్డిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు నేతలు మీడియాకు వివరించారు. ఎన్నికల సంఘం ఇవాళ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేసింది. తక్షణం ఆయనను ఎన్నికల విధుల్లోంచి తప్పించాలని, ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితా ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది. ఓటర్లకు పెద్ద ఎత్తున మద్యం పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యత్రడు అచ్చెన్నాయుడు ఈసీకి ఇటీవలే ఫిర్యాదు చేశారు.