టార్గెట్ హైదరాబాద్
ఆగస్టు 15కి ఐబీ హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్రదినోత్సవ వజ్రోత్సవాల వేళ.. నగరంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉద్ర సంస్థలకు దాడులకు పాల్పడొచ్చని ఇంటెలెజెన్స్ బ్యూరో ఐబీ హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు, కీలక నగరాలను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఐబీ వెల్లడించింది. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టంచేసిన పోలీసులు… ఈనెల 30 వరకు హై అలర్ట్ కొనసాగిస్తామని చెప్పారు.