చంద్రబాబుకి మోదీ అభయం.. జగన్ గుండెళ్లో రైళ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు సింహం సింగిల్‌గా వస్తుంది అని డైలాగులు వేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మాత్రం తీవ్రంగా భయపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తాజాగా జరిగిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని చెప్పవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించడానికి ప్రధాన కారణం అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా బాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడంతో వైసీపీ నేతల్లో కంగారు మొదలయ్యింది. అంతేకాకుండా ఈ పర్యటనలో మోదీ చంద్రబాబును పక్కకు పిలిచి మరి మాట్లాడటం, ఆయనతో చాలా సన్నిహితంగా మెలగడం వంటి సీన్లు ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయ్. నిన్నటివరకు నేనే రాజు నేనే మంత్రి అన్న వైసీపీ ఇప్పుడు మాత్రం తోక ముడుచుకున్నట్లు కన్పిస్తుంది.
దీనిలో భాగంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు బ్రేక్ వేసింది. దీనిలో ప్రధానంగా కేవలం రూ.5/- పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్ పథకాన్ని రద్దు చేసింది. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెబుతోంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్దిని మాత్రం గాలికి వదిలేసింది. వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నిరసనలు ఎక్కువయ్యాయ్. నిరసన సెగలు వాడవాడలా వైసీపీకి నిత్యం ఎదురౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మోదీ కలయిక వైసీపీ నాయకులకు టెన్షన్ కలిగిస్తోంది.
వైసీపీ మంత్రుల నేతలు తాజాగా చేస్తున్న అసభ్యకరమైన వ్యవహారాలు పార్టీని చికాకు పెడుతున్నాయ్. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కలిగిస్తున్నాయ్. ఇటువంటి పరిణామాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పి..చంద్రబాబును స్వాగతిస్తారేమో అన్న అనుమానం వైసీపీ నాయకులను వెంటాడుతోంది.