NationalNewsNews Alert

ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌…

ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ప్రియులకు శుభవార్త. రేపటినుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. అమెజాన్‌లో గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ ఆగస్టు 6 నుండి స్టార్ట్‌ అవ్వనుంది. ఈ ఆఫర్లు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి. మరోవైపు.. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ రేపే ప్రారంభమై 10 వ తేదీ వరకు కొనసాగుతాయి. రెండు ప్రముఖ సంస్థల సేల్‌ 5 రోజుల పాటు కొనసాగనున్నాయని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు ప్రకటన చేశాయి.

అమెజాన్‌లో గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌లో బ్యాంక్‌ కార్డ్‌ ఆఫర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా ప్రొడక్టులపై 10 శాతం అదనపు తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. రూ. 2000 వరకు తగ్గింపు పొందవచ్చు. ట్రాన్సాక్షన్‌ విలువ కనీసం రూ. 5,000 ఉండాలని షరతులు విధించింది.

ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ కూడా బ్యాంక్‌ కార్డ్‌ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుందని ఫ్టిప్‌కార్ట్‌ తెలిపింది.