జీవో నెంబర్ 1పై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు
ఏపీలో రహదారులపై సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారు జీవోపై హైకోర్టు స్టే విధించడంపై… ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐతే కేసు విచారణలో ఉన్న సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అంతకు ముందు… జీవో నెంబర్ 1ని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఐతే కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసం విచారిస్తోందని పేర్కొంది. 23న ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట వాద, ప్రతివాదనలు విన్పించుకోవాలని సూచించింది.


