భారత్‌కు రానున్న సునీతా విలియమ్స్..
తొమ్మిది నెలల పాటు రోదసిలోని అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో సురక్షితంగా భూమిని చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్యూల్ బుధవారం తెల్లవారుజామున క్షేమంగా ఫ్లోరిడా సముద్ర జలాలలో దిగింది. సునీత క్షేమంగా తిరిగి రావాలని ఆశిస్తూ భారత ప్రధాని మోదీ ఆమెను భారత్‌కు ఆహ్వానించారు. అలాగే వారి పూర్వికుల గ్రామం గుజరాత్‌లోని ఝలాసన్‌లో ఆమె బంధువులు, గ్రామస్థులు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునీత కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామని ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపమని బంధువులు పేర్కొన్నారు. ఆమె త్వరలోనే భారత్‌కు రానున్నారని పేర్కొన్నారు. ఆమె తండ్రి గుజరాత్‌కు చెందిన భారతీయ సంతతి వ్యక్తి న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, తల్లి స్లొవేకియా దేశానికి చెందిన బోనీ. వీరు ఎప్పుడో అమెరికాలోని ఓహయో దేశంలో స్థిరపడ్డారు.