NewsTelangana

మెతుకు ముట్టమంటున్న బాసర ఐఐటీ విద్యార్థులు

Share with

దేశానికే ఆదర్శం అంటారు. రాష్ట్రాన్ని చక్కబెట్టలేరని కానీ దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలంటారు. పాలకుల మాటలు నేతి బీరకాయ చందంలా కన్పిస్తున్నాయ్. చెప్పేది చేయరు. చేయాల్సింది చేయరు. పెద్ద పెద్ద అంశాల సంగతి తర్వాత గానీ… అన్నమో రామచంద్కర అంటున్న విద్యార్థుల బాధలను మాత్రం పరిష్కరించకుండా టైమ్ పాస్ చేస్తున్న సర్కారు దేశంలో ఇదేనేమో… బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. డిన్నర్ బాయ్ కాట్ చేసి మెస్ దగ్గర ఆందోళనకు దిగారు. మెస్ కాంట్రాక్టులు రద్దు చేస్తామని చెప్పిన పాలకులు అదీ కూడా చేయలేదని విద్యార్థులు గోసపడుతున్నారు. ఫుడ్ శాంపిల్ రిపోర్ట్స్ ఎందుకు బయటపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వచ్చి… ఫుడ్ పాయిజన్ కారణమైన మెస్ కాంట్రాక్టులను రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అప్పటి వరకు భోజనం చేసేది లేదని E1, E2 విద్యార్థులు భీష్మించుకుకూర్చున్నారు. విద్యార్థుల ఆందోళనతో మెస్ టెండర్లకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంతలా పరిస్థితి అయ్యేలా తెచ్చుకోవడం ఎందుకు? విద్యార్థులంటే అంత చులకనా…? భావి భారత విద్యార్థుల్ని తయారు చేయాల్సిన విద్యా సంస్థలు… విద్యార్థుల ఆందోళనలతో సుదీర్ఘకాలం ఇలా ఉంటే… ఇక వారు చదువు సాగేదెలా?