బాసర ఐఐటీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఏడు రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. 12 న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సిందిగా విద్యార్థులు కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. జాతీయ రాజకీయాలు చేసే సీఎం… స్థానిక సమస్యను మాత్రం పరిష్కరించలేరా అంటూ విపక్షాలు మండిపడుతుంటే… విద్యార్థులు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఆందోళన ఆపబోమంటున్నారు. ఇవాళ కూడా… కాలేజీ మెయిన్ ఎంట్రీ వద్ద బైఠాయించిన విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, సబిత రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు
1) సీఎం కేసీఆర్ తక్షణం యూనివర్శిటీని సందర్శించాలి
2) యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలి. క్యాంపస్‌లోనే వీసీ ఉండాలి
3) విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులుండాలి
4) ఇన్ఫర్మషన్ టెక్నాలజీ ఆధారంగా విద్యను అందించాలి
5) క్లాస్ రూమ్‌లు, హాస్టల్ గదులను రిపేర్ చేయించాలి
6) లైబ్రరీలో అన్నిరకాల పుస్తకాలు ఉంచడంతోపాటు, టైమింగ్ మార్చాలి
7) ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు ఇవ్వాలి
8) విద్యార్థుల ఉపయోగించే సౌకర్యాలు మెరుగుపర్చాలి (ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటర్నెట్)
9) మెస్ మెయింటెనెన్స్ చేసే పద్ధతి పూర్తిగా మారాలి
10) టెండర్లలో అక్రమాలను గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి
11) పీడీ, పీఈటీలను నియమించి, ఆటలను ప్రోత్సహించాలి
12) దేశంలోని అన్ని యూనివర్సిటీలతో బాసర ఐఐటీని అనుసంధానించాలి