NationalNews

ఢిల్లీలో లిక్కర్ కొరత… ఎందుకంటే?

Share with

ఎక్సైజ్ పాలసీని రద్దు చేయడంతో ఢిల్లీలో సోమవారం నుంచి మద్యం కొరత తలెత్తేలా ఉంది. జూలై 31తో కొత్త ఎక్సైజ్ పాలసీ గడువు ముగియనుండడంతో నగరంలో నడుస్తున్న 468 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఆగస్టు 1 నుంచి మూసివేయాల్సి ఉంది. కొత్త ఎక్సైజ్ పాలసీ 2021-22ను విత్ డ్రా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో ప్రైవేట్ మద్యం దుకాణాలు గడువు మేరకు మూసివేయాల్సి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్ద మద్యం కొరత ఎదురుకానుంది. జూలై 31తో కొత్త ఎక్సైజ్ పాలసీ గడువు ఉన్నందున 468 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఆగస్టు 1 నుంచి మూసివేయాలి.

అందుకే శని, ఆదివారాల్లో నగరంలోని ప్రైవేట్ మద్యం దుకాణాలు తమ మిగిలిన స్టాక్‌ను విక్రయించడానికి వన్ ప్లస్ వన్, ఒకటి కొంటె రెండు ఉచితమంటూ భారీ తగ్గింపులు పథకాలను అందించాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి మాత్రమే మద్యం విక్రయించాలని ఆదేశించిందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచే ముందు నగరంలో ఎలాంటి గందరగోళం జరగకుండా చూడాలని, అలాగే అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్న తర్వాత నగరంలో మద్యం సరఫరాను నిర్ధారించడానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి ఢిల్లీ ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేదని మందు బాబులు వాపోతున్నారు.

కొత్త పద్దతిపై క్లారిటీ మిస్సయ్యిందంటూ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు కబీర్ సూరి మండిపడ్డారు. ఎక్సైజ్ పాలసీ 2021-22 నగరంలో మద్యం కొరత ఏర్పడటం రెండేళ్లలో ఇది రెండోసారి. నవంబర్ 17, 2021 నుండి కొత్త ఎక్సైజ్ ప్రైవేట్ మద్యం విక్రయాల నిర్వహణలోకి రావడానికి మూడు వారాల ముందు, ప్రభుత్వ దుకాణాలు, వ్యక్తిగత లైసెన్సుల రిటైల్ వ్యాపారాన్ని ఆపేయడంతో ఢిల్లీలో మద్యం కొరత ఏర్పడింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం 849 రిటైల్ మద్యం దుకాణాలకు గత ఏడాది ఎక్సైజ్ శాఖ ఓపెన్ బిడ్డింగ్ ద్వారా లైసెన్స్‌లు జారీ చేసింది. ప్రస్తుతం నగరంలో 468 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఐతే మద్యం దుకాణాలు మూసేయడం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి లేకుండా పోతుందన్న వర్షన్ విన్పిస్తోంది.