Home Page SliderTelangana

ఆ ఫ్యాక్టరీలో పనులు నిలిపివేయండి..

నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజల భారీ ఆందోళనలతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురు రైతులను చర్చలకు పిలిచారు. గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయితే, ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కంపెనీ ఏర్పాటు మీద స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.