గొటబాయ గెటౌట్ అంటున్న సింగపూర్
ఇటీవల కాలంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక నుండి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స(Gotabaya Rajapaksa) ప్రస్తుతం సింగపూర్‌లో(Singapore) ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సింగపూర్ ప్రభుత్వం ఆయనను ఆదేశించంది. ఇకపై ఆ దేశంలో ఉండేందుకు గడువు పొడిగించలేమని ఆ దేశ అధికారులు ఆయనకు తేల్చి చెప్పినట్లు సమాచారం. శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలలకు తట్టుకోలేని గొటబాయి రాజపక్స సతీసమేతంగా మొదట మాల్దీవులకు చేరుకున్నారు. తర్వాత అక్కడ నుండి గురువారం సింగపూర్‌కు చేరుకున్నారు. సింగపూర్ వచ్చే సమయానికి ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని… అధ్యక్ష హోదాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని సింగపూర్ ప్రభుత్వం అంటోంది. మరికొన్ని రోజులు గొటబాయ ఆ దేశంలో ఉండేందుకు సింగపూర్ ప్రభుత్వం నిరాకరించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఆశ్రయం కావాలని ఆయన కోరలేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.