NationalNews

బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్బ్రాంతి

Share with

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా కాల్‌ఘాట్‌లో ప్రయాణికులతో వెళ్తోన ఓ బస్సు నర్మద నదిలో మహారాష్ట్ర బస్సు బోల్తా పడింది. 40 మందితో వెళ్తున్న బస్సు బ్రిడ్జిపై ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా… 15 మందిని భద్రతా బలగాలు రక్షించాయ్. ఇండోర్ నుంచి పూణె వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైనట్టు మధ్యప్రదేశ్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.