మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్..
వైసీపీ నేతలు, మద్దతుదారులు ఒక్కొక్కరిపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. వైసీపీ నేత వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్టు చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి, విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో ఐపీఎస్ జాషువాతో కలిసి స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు అనుమతి కోసం గవర్నర్ అనుమతి కోరింది. అనుమతి లభించగానే ఆమెపై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.

