Home Page SliderNational

కర్ణాటకకు ‘లోటస్’ ఆకారంలోని శివమొగ్గ విమానాశ్రయం

కర్ణాటకలోని కొత్త ఎయిర్‌పోర్టు శివమొగ్గలో ప్రారంభమైంది. దీనిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక వసతులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 27న సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు.

దీనితో కర్ణాటకలోని మల్నాడు జిల్లాలైన శివమొగ్గ, హసన్, చిక్కమంగళూరు జిల్లాలకు మేలు చేకూరనుంది. దీనివల్ల ఈ ప్రదేశంలోని పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేంద్రప్రభుత్వం ‘ఉడాన్ పథకం’ కింద శివమొగ్గ జిల్లాలో ‘సోగానే’ అనే ప్రాంతంలో నిర్మించారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్. ఇది కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా, కర్ణాటకలో రాష్ట్రప్రభుత్వంచేత నిర్వహింపబడుతుంది. ఈ విమానాశ్రయాన్ని 450 కోట్ల వ్యయంతో నిర్మించారు.

దీని ఆకారం పైనుండి చూస్తే తామరపువ్వు ఆకారంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ప్రైవేట్ ఆపరేటర్స్‌కు అనుమతినిస్తున్నారు. దీని ప్రారంభానికి ముందే డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి వాణిజ్యవిమానాలకు, ప్రైవేట్ విమానాలకు అనుమతి లభించింది. ఈ విమానాశ్రయం ద్వారా ఐటీ, టూరిజం, డెయిరీకి ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.