Andhra PradeshHome Page SliderSpiritualTrending Today

టీటీడీ కీలక నిర్ణయం..

తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 24 నుండి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు ఈ లేఖలు వర్తిస్తాయి. సోమ, మంగళవారాలలో వీఐపీ బ్రేక్,  బుధ, గురువారాలలో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఉంటుంది. ఒక లేఖపై ఆరుగురికి దర్శనం ఉంటుంది. ఈ మేరకు నేడు టీటీడీ ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఈ విషయంలో తమ అసహనం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే.