NationalNews

శివసేన వర్సెస్ షిండే సేన

Share with

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు వదులకోవాలని షిండే సేన డిమాండ్ చేస్తుంటే… రెబల్స్‌పై వేటు వేయాలంటూ శివసేన తేల్చి చెబుతోంది. శివసేనను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నవారితో మాట్లాడేదేముందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్ధవ్ థాక్రే. శివసేన నుంచి వెళ్లిపోయినవారితో పనేంటని ఆయన ప్రశ్నించారు. 40 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతుందంటూ చెబుతున్న షిండే వర్గానికి మరో షాక్ ఇచ్చారు ఉద్ధవ్ థాక్రే. మరో నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు. ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ను ఉద్ధవ్ థాక్రే కోరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని… రెబల్స్ పై వేటు వేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిందని.. కర్నాటకలో ఇదే తరహా రాజకీయం నడిచిందని శివసేన నేతలు చెబుతున్నారు. 37 మంది శివసేన ఎమ్మెల్యేలు… తమ నాయకుడిగా షిండేను గుర్తించాలని డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు.

maharashtra dy speaker  Narhari Zirval 

మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నరహరి జిర్వాల్ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని షిండే సేన నేతలు తేల్చి చెబుతున్నారు. శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా అజయ్ చౌదరి నియామకాన్ని డిప్యూటీ స్పీకర్ ఆమోదించారు. రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు పంపించేందుకు డిప్యూటీ స్పీకర్ రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నోటీసులు వచ్చిన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని షిండే వర్గం యోచిస్తోంది. అదే సమయంలో ఈసీని కలిసి… తామనే అసలు శివసేనగా గుర్తించాలని, పార్టీ సింబల్ కేటాయించాలని షిండే వర్గం నేతలు భావిస్తున్నారు. మరోవైపు శరద్ పవార్‌ను కేంద్ర మంత్రి బెదరిస్తున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మోడీజీ, అమిత్ షా ఇలాంటివి మీరు ప్రోత్సాహిస్తారా అంటూ ప్రశ్నించారు. శరద్ పవార్ మహారాష్ట్ర భూమి పుత్రుడని… అలాంటి వ్యక్తిని బెదిరిస్తారా అంటూ దుయ్యబట్టారు. షిండే వర్గం పేర్లన్నీ పేపర్ల మీద మాత్రమే ఉన్నాయని… శివసేన మహాసముద్రమని… అలలు వస్తుంటాయ్.. పోతుంటాయంటాయని మొత్తం పరిణామాలను తేలిక చేసి మాట్లాడారు సంజయ్ రౌత్.