NationalNews

10 నిమిషాల కాల్ మహా భవితవ్యం మార్చేస్తోందా?

Share with

తిరుగుబాటు నాయకుడు ఎక్‌నాథ్ షిండేతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే 10 నిమిషాల పాటు టెలిఫోన్ కాల్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కటీఫ్ చెప్పాల్సిందే.. బీజేపీతో కలవాల్సిందేనంటూ సింగిల్ పాయింట్ ఎజెండాతో మంత్రి ఎక్ నాథ్ షిండే డిమాండ్లు పెట్టడంతో మహా సీఎం ఉద్ధవ్ థాక్రే షాక్ కు గురయ్యారు. షిండేతో చర్చలు జరపమని చెబుతూనే… శివసేన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జీ-22గా ఏర్పడిన నేతలు… ఇప్పుడు సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఓ విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడమంటే… విధానాలను మార్చేసుకోవడమేనంటూ కుండబద్ధలుకొడుతున్నారు. మరోవైపు షిండేకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఎక్ నాథ్ వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయ్. వాస్తవానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో శివసేన, బీజేపీ మధ్య అవగాహన కుదరకపోవడంతో… శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఎన్సీపీ నేతతో కలిసి దేవేంద్రఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మొత్తంగా మహారాష్ట్రలో తాజా సంక్షోభం హిందుత్వ ఎజెండాతో సాగేలా కన్పిస్తోంది.