మహరాష్ట్ర ప్రజలకు సీఎంగా షిండే తొలి కానుక
ఏక్‌నాథ్ షిండే తాజాగా ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి మహరాష్ట్ర సీఎంగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మహరాష్ట్ర లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ముందుగా మహారాష్ట్రలో పెట్రోల్ ,డీజీల్ ధరలు అమాంతంగా పెరిగాయి.అయితే సీఎం ఏక్‌నాథ్ షిండే దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ,డీజీల్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఇది ఆయన రాష్ట్ర ప్రజలకు అందించిన తొలికానుకగా ప్రజలు భావిస్తున్నారు.పెట్రోల్ పై లీటరుకు రూ.5/- ,డీజిల్ పై రూ.3/-తగ్గించినట్లు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.6000/- కోట్ల భారం పడుతుందని అయినప్పటికీ సామాన్య ప్రజలకు మేలు జరగాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాకు సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం శివసేన -బీజేపీ ప్రభుత్వాలు నిబద్దతతో పనిచేస్తున్నాయన్నారు.
Read More: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి ముందంజ