Andhra PradeshNews

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరిగిన గోదావరి వరద ఉధృతి       

Share with

గోదావరి వద్ద వరద ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతోన్న వరద ముప్పు కారణంగా అక్కడ రెండో హెచ్చరికను ప్రభుత్వం జారీచేసింది. వరద స్థాయి పెరిగితే మూడో హెచ్చరికను కూడా జారీచేసే అవకాశముందని పెర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.97 లక్షల క్యూసెక్కులుగా వెల్లడించింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ, కటుకూరు గ్రామాలకు ఇప్పటికే  రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా అక్కడ ప్రాంతం మెత్తం నీళ్ళు నిలిచి జీవనం మెత్తం స్ధంభించిపోయింది. అక్కడ ఉన్నవారికి ఆహారం అందించేందుకు ప్రభుత్వం కొన్ని హెలికాఫ్టర్‌లను రంగంలోకి దింపి ఆహారాన్ని అందించారు.

Read More: టీఆర్ఎస్‌ను తరుముకొస్తున్న బీజేపీ… ఆరా సర్వే ట్విస్ట్