కరోనా బారిన పడిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్య కారణంతో ఆసుపత్రిలో చేరారు. గత మంగళవారం ఆస్వస్ధతగా ఉన్న కారణంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. దీనితో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారని… అందరు మాస్కులు, సానిటైజర్‌లు ఉపయోగించాలని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. ఆయన అరోగ్యం కుదుటపడని కారణంతో… చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారని హాస్పటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై స్పందించిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
Read More: కేంద్ర నిర్ణయంతో దేశంలో ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ