NationalNews

16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు

Share with

శివసేన రెబల్స్‌కు డిప్యూటీ స్పీకర్ నరహరి జీర్వాల్ ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు నాయకుడు ఎక్ నాథ్ షిండే ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాడు. 33 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారని….వారిలో ఎవరూ కూడా నేరుగా తెచ్చి ఇవ్వలేదని… మెయిల్ ద్వారా పంపితే నిర్ణయాలు తీసుకేలేమన్న వర్షన్ విన్పిస్తోంది స్పీకర్ కార్యాలయం. మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 16 మందికి డిప్యూటీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు వేటు వేయకూడదో చెప్పాలని కోరారు. అనర్హతపై సోమవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరారు.