వైఎస్ జగన్ పై షర్మిల కీలక వ్యాఖ్యలు
అన్ని కుటుంబాల్లో ఆస్తుల గొడవలు సర్వసాధారణమైతే తల్లి, చెల్లిని ఎందుకు కోర్టుకు ఈడ్చారంటూ జగన్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. ఆస్తుల పంపకాల్లో కలహాలు పెట్టుకోవాలనేదే తమ ఉద్దేశం కాదన్నారు. ఈ విషయాన్ని నాలుగు గోడల మధ్య సామరస్యంగా చక్కబెట్టుకోవాలని తమకు తెలుసని పేర్కొన్నారు. వివిధ జిల్లాల కాంగ్రెస్ నేతల భేటీ కోసం విజయవాడ వెళ్లిన షర్మిల.. విజయనగరం జిల్లా గుర్ల పర్యటన సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

