సిగ్గులేని పాకిస్తాన్ మంత్రి భుట్టో మాటలను పట్టించుకోనక్కర్లేదు…
పాకిస్తాన్ మరింత దిగజారిందన్న కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
ప్రధానిపై బిలావల్ భుట్టో వ్యాఖ్యలను తప్పుబట్టిన భారత్
ఆ వ్యాఖ్యలతో మోదీ ఇమేజ్‌పై ప్రభావం ఉండదన్న కేంద్రం
తీవ్రవాదులను కొమ్ముగాస్తూ భారత్‌పై విమర్శలా అంటూ ధ్వజం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత దాడికి పాల్పడిన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై భారత్ ఈరోజు విరుచుకుపడింది. భుట్టో ఆ వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ను దిగజార్చారంది. ఐక్యరాజ్యసమితిలో బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. భారతదేశంపై విమర్శలు చేయడం మానుకోవాలని… “మేక్ ఇన్ పాకిస్తాన్ టెర్రరిజం”ను విదేశాంగ శాఖ హితవు పలికింది. గురువారం ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ గురించి చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందెవరో ప్రపంచానికి తెలుసనంటూ కేంద్ర విదేశాంగ మంత్రి కామెంట్స్‌కు భుట్టో కౌంటర్ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడని… భారతదేశానికి ప్రధాన మంత్రి అంటూ దుర్మార్గపూరిత వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ను “ఉగ్రవాదానికి కేంద్రంగా” అభివర్ణించడంపై భుట్టో ఇలా స్పందించాడు.

భుట్టో వ్యాఖ్యలు.. పాకిస్తాన్ నేలబారు తనానికి నిదర్శనమంది విదేశాంగ శాఖ. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి 1971లో జరిగిన ఘటనలను మర్చిపోయారంది. పాకిస్తాన్ పాలకులు బెంగాలీలు, హిందువులపై జరిపిన మారణహోమం చరిత్ర ఎన్నటికీ మరచిపోరంది. మైనారిటీల విషయంలో పాకిస్తాన్ ఎలా వ్యవహరించిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అనవసరంగా ఇండియాపై అభాండాలు వేయడం మానుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. భుట్టో అనాగరిక దుండుడుకుతనం, ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రాక్సీలను ఉపయోగించుకుంటున్న తీరు స్పష్టమైందంది.

న్యూయార్క్, ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్ వంటి నగరాలు పాకిస్తాన్ ప్రాయోజిత మద్దతు ఉన్న, ప్రేరేపిత ఉగ్రవాదమన్న విషయం అందరికీ తెలుసునంది. ఈ దాడులన్నీ కూడా ప్రత్యేక ఉగ్రవాద కేంద్రాల్లో పుట్టినవేనని… ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేస్తోందని… మేక్ ఇన్ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపాలని ఇండియా కోరింది. ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశం పాకిస్తాన్ అని భారత్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి నియమించిన 126 మంది ఉగ్రవాదులు, 27 మంది తీవ్రవాదులు కలిగి ఉన్న దేశం పాకిస్తానేనంది. పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బుల్లెట్ల నుండి 20 మంది గర్భిణీ స్త్రీల ప్రాణాలను రక్షించిన ముంబై నర్సు శ్రీమతి అంజలి కుల్తే సాక్ష్యాన్ని పాక్ విదేశాంగ మంత్రి భద్రతా మండలిలో మరింత హృదయపూర్వకంగా విని ఉండాల్సి ఉందంది.

పాకిస్తాన్ మంత్రి నిరాశ తన సొంత దేశంలోని ఉగ్రవాద సంస్థల సూత్రధారుల వైపు మళ్లుతోందని… వారు తమ పాలనలో ఉగ్రవాదాన్ని ఒక భాగంగా చేశారంది. పాకిస్తాన్ తన సొంత మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. బిలావల్ భుట్టో మానసిక దివాలాకోరు తనం వల్లే ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేశారంది. భుట్టో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని కేంద్రం విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. విఫల రాజ్యానికి ప్రతినిధినని… మరోసారి విఫలమయ్యాడు… కాబట్టి పాకిస్తాన్ కూడా విఫలమైందని… టెర్రర్ మైండ్‌సెట్ ఉన్న వారి నుండి ఏం ఆశించగలమని ఆమె అన్నారు. భుట్టో వ్యాఖ్యలు నీచమైనవని, సిగ్గుచేటన్నారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. పాకిస్తాన్ నేటికీ 1971 బాధను అనుభవిస్తోందన్నారు. ఆ రోజు 93,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారన్నారు. భుట్టో తాత… జుల్ఫికర్ అలీ భుట్టో, మాజీ పాకిస్తాన్ అధ్యక్షుడు, యుద్ధంలో ఓడినప్పుడు ఏడ్చారని అనురాగ్ ఠాకూర్ విలేకరులతో అన్నారు. ఉగ్రవాదానికి రక్షణ కల్పించడానికి, పాక్ నేలను ఉపయోగించారన్నారు. పాక్ నీచమైన ప్రణాళికలు ప్రపంచానికి బట్టబయలయ్యాయన్నారు ఠాకూర్.

పాకిస్తాన్ తీరుపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. మంచి పొరుగువారిగా ఉండటానికి నా సలహా అన్న హిల్లరీ… మీ పెరట్లో పాములను ఉంచుకుంటే… అవి మీ పొరుగువారిని మాత్రమే కాటేస్తాయని అనుకోవద్దు.. మీపైనా దాడి చేస్తాయన్న విషయాన్ని మరువద్దొన్నారు.

