InternationalNews

బోరిస్ రాజీనామా… ఇంగ్లాండ్ కొత్త ప్రధానిగా భారతీయుడు రిషి

Share with

రాజకీయాల్లో నిచ్చెనలు… ఎక్కినంత సేపు పట్టదు… అధఃపాతాళానికి పడిపోవడం… బోరిస్ జాన్సన్ ఉదంతం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2019లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన కన్జర్వేటివ్ నాయకుడు… ఇప్పుడు రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. సొంత పార్టీలో మంత్రులు, 60కి పైగా ఎంపీలు రాజీనామా చేయాలంటూ డిమాండ్లు చేయడంతో బోరిస్ జాన్సన్ చేతులెత్తేశాడు. ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటికీ కేర్ టేకర్ ప్రధానిగా కొనసాగుతానని చెప్పాడు. ప్రధాని పదవికి రాజీనామా చేసేది లేదంటూ ఉదయం వరకు గర్జించిన జాన్సన్.. సొంత పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు పదవికి రాజీనామా చేయడంతో షాక్ కు గురయ్యాడు. దేశం కోసం, పార్టీ కోసం బోరిస్ జాన్సన్ రాజీనామా చేస్తాడని మంత్రిగా పనిచేస్తున్న నదీమ్ జాహ్వి చెప్పారు.

ఇక బోరిస్ రాజీనామాతో ఇంగ్లాండ్ కొత్త ప్రధాని ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. బోరిస్ జాన్సన్ రాజీనామాతో మొన్నటి వరకు ఆయన కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రిషి సనక్ ఇప్పుడు ప్రధాని మంత్రి రేసులో కీలకంగా ఉన్నారు. గతంలోనే రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అవుతారని ఊహాగానాలు విన్పించాయ్. రిషి సనుక్ సౌంథాప్టన్‌లో మే 12, 1980లో జన్మించాడు. రిషి సునక్ భార్య అక్షిత మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షిత.