పోతే పోనీ… కొత్తోళ్లను తయారు చేసుకుంటా…
శివసేనను ఫినిష్ చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ ఆరోపించారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేతకు నేతలు ఆమోదం తెలిపారు. మరోవైపు శివసేన బాలాసాహెబ్ థాకరే పార్టీ పేరును ఎలా ఉపయోగించుకుంటారంటూ ఈసీకి శివసేన ఫిర్యాదు చేసింది. శివసేనను ఎవరూ కూడా ఫినిష్ చేయలేరని… బీజేపీతో అంటకాగిన వారిని మాత్రం ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు ఉద్ధవ్ థాక్రే. ఎవరైనా వెళ్లాలనుకుంటే నిర్భయంగా పార్టీని వీడి వెళ్లిపోవచ్చని.. కొత్త శివసేనను రూపొందించుకుంటానన్నారు. మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష జరిగినా… సభ్యుల విశ్వాసం పొందుతానన్న దీమా ఉందన్న భావనలో ఉద్ధవ్ ఉన్నారు. రియల్ శివ సేన తామేనంటూ షిండే వర్గం చెబుతున్నా… అందుకు గ్రౌండ్ లేదంటోంది శివసేన లీగల్ సెల్.