జగన్‌తో సెల్ఫీ..మహిళా పోలీస్‌కు వేధింపులు
వైసీపీ నేత జగన్‌తో సెల్ఫీ దిగడం మహిళా పోలీస్ కొంపముంచింది. గుంటూరు జైలు వద్ద మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కలవడానికి వచ్చిన జగన్‌తో ఫోటో దిగేందుకు ఆమె ఒక మహిళా కానిస్టేబుల్, ఆమె కుమార్తె సెల్ఫీ దిగారు.. మీడియాతో మాట్లాడుతూనే వారికి ఫోటో ఇచ్చారు జగన్. దీనితో ఆమెకు పై అధికారుల నుండి వేధింపులు మొదలయినట్లు వైసీపీ పేర్కొంది. ఈ సంఘటనపై మండి పడింది. కేవలం సెల్ఫీ దిగిన కారణంగా ఆమెకు మెమోలు, చార్జిషీటు ఇచ్చారని, దీనిపై విచారణ చేస్తారని సమాచారం. ఆమె విధి నిర్వహణను పక్కన పెట్టి తప్పు చేసిందని, దీనిపై వివరణ కోరినట్లు తెలిసింది. జగన్‌తో ఫోటో దిగిన కానిస్టేబుల్‌పై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించింది. ఉద్యోగులను వేధించడంలో టీడీపీ పార్టీ రాక్షసానందం పొందుతోందని, దీనిపై సోషల్ మీడియాలో చంద్రబాబును, హోం మంత్రి అనితను ప్రశ్నించింది.