బాలికల పాఠశాలలో దారుణం..బాత్‌రూమ్‌లో వీడియో
తెలంగాణలోని సిరిసిల్లలోని తంగళ్లపల్లి బాలికల గురుకుల పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. అక్కడి పీఈటీ మాస్టర్ జ్యోత్స్న బాలికలను విపరీతంగా వేధిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. బాత్‌రూమ్‌ల్లో వీడియోలు తీసి, కర్రతో కొడుతోందని కంప్లైంట్లు ఇచ్చారు. ఆమె ఐదేళ్లుగా అక్కడే పాతుకుపోయిందని, శారీరకంగానూ, మానసికంగానూ బాలికలను వేధిస్తోందని పేర్కొన్నారు. తమను పీరియడ్స్ సమయంలో కూడా స్కూల్ ప్రేయర్‌కు రమ్మని వేధిస్తోందన్నారు. ప్రేయర్ సమయంలో స్నానాలు చేయకూడదని, బాత్‌రూం వద్ద వీడియోలు తీస్తోందని ఆరోపించారు. ఈ బాధలు భరించలేక రోడ్డెక్కి నినాదాలు చేయడంతో విషయం తెలిసిన కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. దీనితో వారు శాంతించారు.