Breaking Newshome page sliderHome Page SliderInternationalNationalNewsNews Alertviral

ట్రంప్ బెదిరింపుల వేళ భారత్ కు రష్యా భారీ డిస్కౌంట్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బెదిరింపులతో పాటు ఐరోపా సమాఖ్య ఆంక్షలతో సతమతమవుతున్న భారత్ కు స్నేహహస్తాన్ని అందించింది రష్యా. చమురు కొనుగోలుపై భారత్ కు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెరికా ప్రతీకార చర్యలు ఊహాతీతంగా ఉండటంతో.. ఉరల్స్ చమురు ధరలు మరింత పతనం కావచ్చని రష్యా అంచనా వేస్తోంది. ఎందుకంటే అమెరికా సెకండరీ ఆంక్షల భయం కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రష్యా నుంచి కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో రష్యా చమురు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడినుంచి భారీఎత్తున ఆయిల్ ను ఎగుమతి చేసేస్తారు. ఈ ఒత్తిడి కూడా ధరలపై పడుతోందని ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపీఎల్ఆర్ లిమిటెడ్ పేర్కొంది. ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ డేటెడ్ బ్రెంట్ చమురు కంటే ఐదు డాలర్లు చౌకగా ఉంది. ఇవి దాదాపు రెండు వారాల క్రితం ఒకే రకంగా ఉండేవి. ప్రస్తుతం భారత్ లో రష్యా చమురుకు 37 శాతం మార్కెట్ వాటా ఉంది. దీనిని ఒక్కసారిగా తగ్గించుకోవాలంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేపీఎల్ ఆర్ పేర్కొంది. ప్రస్తుతం చమురు సంస్థలు కూడా రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేసే అంశాన్ని ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. మరోవైపు అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు మే నుంచి మాత్రం రోజుకు 2,25,000 పీపాలకు చేరాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇవి రెట్టింపైనట్లు లెక్క. ఇది క్రమేపీ వాణిజ్య యుద్ధానికి దారితీస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.