తెలంగాణా ఏపీ మళ్లీ కలుస్తాయా..?
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు షురూ అయిన విషయం తెలిసిందే.ఈ మేరకు తెలంగాణాలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ,కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణాను ఆంధ్రాలో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా ఆంధ్రా వాళ్లు కాంగ్రెస్,బీజేపీ ముసుగులో వస్తున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే ఇక ప్రత్యేక తెలంగాణా ఉండదన్నారు. కాగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తెలంగాణాను ఆంధ్రాలో కలిపేసే కుట్ర చేస్తున్నారని మంత్రి గంగుల ఆరోపించారు. అయితే ఇది మన భవిష్యత్ తరానికి మంచిది కాదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.