I2U2 తొలి సమావేశంలోని ముఖ్యంశాలు
భారత్‌లో ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. దీని కొసం 16వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గురువారం విడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఐ2యూ2 తొలి సమావేశంలో భారత్ , ఇజ్రాయెల్ , అమెరికా , యూఏఈ కూటమిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ , ఇజ్రాయెల్ ప్రధాని యాయిర్ లాపిడ్, యూఏఈ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. ఇంధనం , ఆహారం , నీరు , రవాణ , అంతరిక్షం రంగాల్లో సంయుక్త పెట్టుబడుల గురించి చర్చించారు. ఈ సవాళ్లను అందరు కలిసి కట్టుగా అధిగమించాలని యోచించారు.ఈ అంశాలన్నింటిలో ముఖ్యంగా ఆహార సంక్షోభం , శుద్ధ ఇంధన ఉత్పత్తికి దోహదపడె అంశాలపై తీవ్రంగా చర్చించారు.300 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుని గుజరాత్ బ్యాటరీ ఇంధన వ్యవస్ధ ఆధారంగా నిర్మించాలని నిర్ణయించారు.
తొలి సమావేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీ “ ఆహార భద్రత , ఇంధన వ్యవస్ధ , ఆర్ధిక వృద్ధిని” అనే అంశాలపై ఎంతో మంచిగా చర్చించారు. ఉమ్మడి పెట్టుబడులను లక్ష్యంగా అన్ని దేశాలు ఐకమత్యంగా ముందుకు సాగలన్నారు..దీనికి ఐ2యూ2 మార్గదర్శకం కానుందని పెర్కొన్నారు.
భారత్‌ను వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్తాం..బైడన్
భారత్‌లో వ్యవసాయ పార్కులని అభివృద్ధి చేసెందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రైవేటు రంగ నిపుణుల సహాకారం తీసుకుంటామని బైడన్ అన్నారు. రష్యా , ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుధ్ధం కారణంగా ప్రపంచమంతటా ఆహార ధరలు , ఇంధన ధరలు పెరిగి ప్రజలు ఎంతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని పెర్కొన్నారు. భారత్‌లో ఈ వ్యవసాయ పార్కుల సహాయంతో ఐదేళ్లలోనే ఆహార నిల్వలను 3 రేట్లు అభివృద్ధి చేయగలమని తెలిపారు. అలా జరిగితో భారత్‌లో ఇక ఆహార కొరత అనే సమస్య ఉండదన్నారు. దీని ద్వారా రైతులకు ఎన్నో లాభలు ఉన్నాయన్నారు. ఇక పౌష్టికాహార లోపం అనే పదమే భారత్‌లో ఉండదని బైడన్ తెలిపారు.