ఇది ఆత్మీయుల సునామి: వైయస్ జగన్
◆ విజయవాడ, గుంటూరు మధ్య జన సముద్రం కనిపిస్తుంది
◆ కార్యకర్తల కష్టాల పునాదులపై ప్రభుత్వం ఏర్పడింది
◆ చంద్రబాబుకు పదవి వ్యామోహం, వెన్నుపోట్లు పోడవటం మాత్రమే తెలుసు
◆2024 లో 175 స్థానాలతో మళ్ళీ అధికారాలోకి వస్తామని ప్రకటించిన వైయస్ జగన్
గుంటూరు విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమానికి కార్యకర్తలు వేలాదిగా పాల్గొనడంతో శనివారం ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైయస్ జగన్ ను ఆ పార్టీ ఎన్నుకుంది. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడు హోదాలో వైఎస్ జగన్ మాట్లాడుతూ వర్షం కురుస్తున్న ఎవరు లెక్క చేయకుండా తనమీద ఉన్న అభిమానంతో అలానే ఉన్నారని ఇది ఆత్మీయుల సునామీ అని ఆయన అన్నారు. 13 సంవత్సరాలుగా కార్యకర్తలు చూపిస్తున్న అభిమానం కార్యకర్తల కష్టాల పునాదులపై ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపీ అని వెనకబడిన వర్గాలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని ఒక్క ఎమ్మెల్యే తో ప్రారంభమై నేడు 151 ఎమ్మెల్యేలతో పార్టీ కొనసాగుతుందని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే యిచ్చామో అవి తుచ తప్పకుండా అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ స్థాపించి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామని పరిపాలనలో గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టామని అన్నారు.
చంద్రబాబు నాయుడుకు పదవి వ్యామోహం తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదని ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబు వద్ద లేదని అన్నారు. చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోట్లు పొడవటం మాత్రమేనని ప్రజలకు మంచి చేయాలని ఆలోచన అస్సలు లేదని ఒక్క విప్లవాత్మక ఆలోచనలు కూడ ప్రజల కోసం ఏ రోజు చంద్రబాబు చేయలేదని అన్నారు. పేదల ఎదగకూడదనే చంద్రబాబు విధానమని చంద్రబాబు పిల్లలు మనవళ్ళు ఇంగ్లీష్ మీడియం లో చదువుతారని పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియం లోనే చదవాలని చంద్రబాబు అంటారని విమర్శించారు. చంద్రబాబు దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఎన్నికల సమయంలో వాడుకోవడమేనని టిడిపి గజదొంగల పార్టీ అని అన్నారు
రైతులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం తమదని ఆర్బికేల ద్వారా రైతన్నల చేయి పట్టుకొని నడిపిస్తున్నామని విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్నామని అన్నారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశామని మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు పూర్తి చేశామని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. తమ ప్రభుత్వం లో ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశామని తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని పేదల ఖాతాల్లో నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా నగదు జమ చేస్తున్నామని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులో కేసు వేస్తున్నారని వివిధ ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారని రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు ఏర్పాటు ప్రక్రియ అని ఆయన అన్నారు. చక్రాలు లేని సైకిలును చంద్రబాబు తొక్క లేకపోతున్నారని తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నారని ఎల్లో మీడియా చెప్పినంతమాత్రాన అబద్ధాలు నిజం కావని గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు… సింహాలు కాలేవని విమర్శించారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.