NewsTelangana

లిక్కర్‌ స్కాంలో ఏ విచారణకైనా సిద్ధం

ఢిల్లీ లిక్కర్‌ స్కాంకి తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు.

ఈ సంధర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌ కూతురును కాబట్టే తనను టార్గెట్‌ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ బిడ్డను బద్నాం చేస్తే భయపడిపోతారేమోననే చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని కవిత విమర్శించారు. కేసీఆర్‌ని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారని తెలిపారు. లిక్కర్‌ స్కాంలో ఏ విచారణకైనా తాను సిద్ధమేనని.. ఎలాంటి దర్యాప్తు అయినా చేసుకోవచ్చునని కవిత తేల్చి చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన పోరాటం ఆగదు అన్నారు. దేశ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారని కవిత తెలిపారు.